ఇటీవల అమెరికాలో జరిగిన హౌడీ మోదీ సభలో ప్రసంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అని ప్రధాని మోదీ అన్న విషయం తెలిసిందే. అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్ రెండవ సారి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభలో మోదీ మాట్లాడుతూ ఆ కామంట్ చేశారు. అయితే మోదీ అలా అనలేదని ఇవాళ విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ కామెంట్‌ను వక్రీకరిస్తున్నారన్నారు. మోదీ చెప్పిన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని జైశంకర్ అన్నారు.
2020లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధాని మోదీ ప్రత్యక్షంగా ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడరని కూడా కొందరు విమర్శించారు. అయితే మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జైశంకర్ అనడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాని మోదీ అసమర్థత్వాన్ని కప్పిపుచ్చుతన్న కేంద్ర మంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో కాస్త మోదీకి నేర్పాలంటూ జైశంకర్‌ను కోరారు.
Comments
Post a Comment