Skip to main content

విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి..!


విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి..!
లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌వోసి) రాష్ట్రప్రభుత్వం ఇవ్వడంతో కేంద్రప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ముందస్తుగా నగదు చెల్లించలేదని కెఎస్‌కె అనే ప్రైవేట్‌ కంపెనీ ఫిర్యాదు చేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యుత్‌ సంస్థలను కేంద్రప్రభుత్వం బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా పవర్‌ ఎక్సైంజ్‌లో రాష్ట్రం విద్యుత్‌ కొనుగోలు చేసుకునేందుకు వీలు లేకుండా కేంద్రం చేసింది. రాష్ట్రప్రభుత్వం నగదు జమచేయడంతో కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నట్లు సోమవారం సదరన్‌ రీజనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఆర్‌ఎల్‌డిసి) వెబ్‌సైట్‌లో పేర్కొంది. కెఎస్‌కె థర్మల్‌ కేంద్రానికి రూ.120 కోట్లు రాష్ట్రప్రభుత్వం సోమవారం చెల్లించడంతో ఎక్సెంజ్‌లో రాష్ట్ర డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో శని, ఆదివారాలతో పోల్చుకుంటే సోమవారం రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు కూడా తగ్గాయి. ఆదివారం 6879 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా అందుబాటులో 6670 మెగావాట్లు ఉంది. 200 మెగావాట్లు లోటు ఉంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం డిమాండ్‌ పెరిగింది. 7,200 మెగవాట్ల అవసరం కాగా అందుబాటులో 6,940 మెగావాట్లు ఉంది. 900 మెగావాట్ల లోటు ఉండగా, పవర్‌ ఎక్సెంజ్‌లో 680 నుంచి 1450 మెగావాట్లను డిస్కంలు కొనుగోలు చేశాయి. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం జెన్‌కో ఉత్పత్తి తగ్గింది. ఆదివారం 2,777 మెగావాట్ల ఉత్పిత్తి కాగా, సోమవారం 2,550 మెగావాట్లే ఉత్పిత్తి జరిగింది.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.