Skip to main content

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్

కోర్టు ఎదుట లొంగిపోయిన... కోడెల కుమారుడు శివరామ్– News18 Telugu

ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం కోర్టు ఎదుట లొంగిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని శివరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. కేట్యాక్స్ పేరుతో ఆయన వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అతనితో పాటు ఆయన సోదరిపై కూడా పలువురు బాధితులు 19 కేసులు పెట్టారు. అయితే ఆరు కేసుల విషయంలో హైకోర్టు నుంచి కోడెల శివరామ్ బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఆయనను కింది కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో శివరామ్ ఇవాళ గుంటూరు జిల్లా నరసరావు పేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపొయారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.అయితే శివరామ్‌కు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.