తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలిచ్చింది. రెండు వారాలపాటు సచివాలయం కూల్చివేత పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై కూడా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయవద్దని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరుపరి ఉత్తర్వులు దసరా సెలవుల తర్వాత వెల్లడిస్తామని, అప్పటివరకు ఎన్నికలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొంది.
Comments
Post a Comment