Skip to main content

రైలు ఆలస్యమైతే పరిహారం... రైల్వేమంత్రి సంచలన ప్రకటన.















భారత రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-లక్నో మధ్య నూతనంగా ప్రారంభం కానున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రైలు ఆలస్యమైతే పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రైలు గంట ఆలస్యమైతే ప్రయాణికులకు రూ.100 రూపాయలు, 2 గంటలు ఆపైన ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.  
అంతేకాదు.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా ఐఆర్‌సీటీసీ అందించనుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికుల వస్తువులు చోరీకి గురైనా, దోపిడీ జరిగినా ఇదే ప్రయాణ బీమా ద్వారా రూ.లక్ష వరకు పరిహారమిచ్చే అవకాశం కూడా ఉంది. తాజా నిర్ణయంతో రైలు ఆలస్యానికి పరిహారం చెల్లించే తొలి రైలుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోనుంది.

Comments