Skip to main content

జగన్ సంచలన నిర్ణయాలు.సంకట స్థితిలో సీఎం కేసీఆర్

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు. ప్రధానంగా పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పున: పరశీలించడం లాంటి నిర్ణయాలను అమలు చేయడానికి మిగితా రాష్ట్రాలు పూనుకుంటున్నాయి.ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమో గాని జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పొరుగు రాష్ట్రం తెలంగాణా సీఎం కేసీఆర్ ను చిక్కుల్లోకి నెడుతున్నాయి.
ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా జగన్ ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఇందులో ప్రధానమైనది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని పనిని చేసి చూపించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు తాను హామీ ఇచ్చిన విధంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది.ఆర్టీసి విలీనానికి తోడు తాజాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుంటే…గన్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరింత ఇబ్బందిగా మారిందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో మాదిరగానే తెలంగాణాలో కూడా ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. అసలే దరసా కావడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.
ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఈ విషయంలో మరింత ఒత్తిడి పెరిగినట్టయ్యిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.అప్పుల్లో ఉన్న ఏపీ రాష్ట్రం ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంటే… ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.