Skip to main content

మార్కెట్‌లోకి బొంగు బాటిళ్లు.. ప్లాస్టిక్‌కు గుడ్‌ బై చెప్పండి..

వీటితో పాటు ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూల వంటి ఉత్పత్తులను అక్టోబరు 2 నుంచి ఖాదీ స్టోర్లలో అమ్ముతారు. ఇలాంటి వాటితో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది
మార్కెట్‌లోకి బొంగు బాటిళ్లు.. ప్లాస్టిక్‌కు గుడ్‌ బై చెప్పండి..– News18 Telugu


గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి సింగిల్ యూస్ (ఒకసారి మాత్రమే వాడగలిగే) ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది కేంద్రం. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు. వాడకూడదు. నిల్వ చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ కోసమే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే ప్లాస్టిక్‌ బ్యాన్ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది కేంద్రం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు శాఖ (MSME) కింద పనిచేసే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) వెదురు బాటిళ్లను తయారు చేస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు శాఖమంత్రి నితిన్ గడ్కరీ బొంగు బాటిల్‌ను లాంచ్ చేశారు. కేవీఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో బాటిళ్లను తయారు చేశారు. ప్రకృతిలో పెరిగే ఈ బొంగులతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పైగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 750 మిల్లీ లీటర్ల ఈ బాటిల్ ధర రూ.300. అక్టోబరు 2 నుంచి ఖాదీ స్టోర్లలో వెదురు బాటిళ్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇక ప్లాస్టిక్ గ్లాసు స్థానంలో మట్టి గ్లాసులను తయారు చేస్తోంది KVIC. ఇప్పటికే కోటికి పైగా మట్టి గ్లాసులను తయారు చేశారు. ఈ ఏడాది చివరికల్లా కోటి నుంచి మూడు కోట్ల వెదురు బాటిళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూల వంటి ఉత్పత్తులను అక్టోబరు 2 నుంచి ఖాదీ స్టోర్లలో అమ్ముతారు. ఇలాంటి వాటితో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.