ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని మహిళలు వేడుకొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని ఆందోళనకు దిగినందుకు మహిళలనీ కూడా చూడకుండా వారిని రోడ్డుపైకి ఈడ్చి కొట్టిస్తారా? ‘మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమ్మల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ గారూ!’ అంటూ విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లల్లో పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు ఉన్నారని మహిళలు చెబుతున్నా జగన్ కనికరించడం లేదని విమర్శించారు.
Comments
Post a Comment