Skip to main content

చిక్కుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంకు.. భారీ కుట్ర జరిగిందంటూ రెలిగేర్ ఫిర్యాదు

Image result for lakshmi vilas bank
ప్రైవేటు రంగానికి చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను బ్యాంకు దుర్వినియోగం చేసిందంటూ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీలోని కన్నాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు బోర్డు డైరెక్టర్లపై మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంకుపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయమై బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ)కి సమాచారం అందింది.

తాము చేసిన డిపాజిట్ దుర్వినియోగం వెనక భారీ కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని రెలిగేర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఎల్‌వీబీ కేంద్రంగా ఇది నడిచినట్టు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు మొత్తం బ్యాంకు బోర్డుపైనా, లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్నది తెలియరాలేదు. ఎల్‌వీబీపై ఫిర్యాదుతో ఆ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా పతనం చెందాయి. ఎన్ఎస్‌ఈలో షేరు విలువ రూ.36.50 వద్ద, బీఎస్‌ఈలో రూ.36.55 వద్ద ముగిసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.