ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరపాలంటూ ‘ఆంధ్ర మేథావుల ఫోరం’ ముఖ్యమంత్రి జగన్మోహన్ కి వినతిని సమర్పించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతిలో క్రింది అంశాలను ప్రస్తావించారు... అవి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేటి వరకూ విభజన తరువాత అవతరణ దినోత్సవం జరపటం ఆపివేసినదని.. మొదటగా జూన్ 2న ఆ దినోత్సవం జరపాలని నిర్ణయించగా తమ వేదిక నాడే తీవ్రంగా వ్యతిరేకించినదని తెలిపారు. వ్యవహారికంగా చూస్తే అక్టోబర్ 1 , 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగా ఆరోజు పుట్టినరోజుగా, నవంబర్ 1, 1956లో తెలంగాణతో వివాహదినం, అదే జూన్ 2 విడాకుల దినంగా మాత్రమే అవుతుందని తెలిపారు. అక్టోబర్ 1న ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా మేము గత ప్రభుత్వాన్ని అనేకసార్లు అడిగాము. స్పందన లేదని, ఈ విషయమై తక్షణ చర్య తీసుకుని అవతరణ దినోత్సవం జరపవలసిందిగా జగన్‌ని కోరుతున్నట్టు ఫోరం ప్రతినిధులు చెప్పారు.
Comments
Post a Comment