Skip to main content

బ్యాంకర్లతో పలు అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిపిన సీఎం జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌ రెడ్డి అధ్యక్షతన 208 వ ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వివిధ పథకాల కింద ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు జగన్. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుకోకూడదని అందుకోసం అన్ ఇన్ కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుంది.
ఈ విషయం లో బ్యాంకులు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సీఎం జగన్ తెలిపారు. మా ఆర్థిక శాఖతో టచ్ లో ఉండండి వడ్డీ లేని రుణాల కింద చెల్లించవలసిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం అని జగన్ పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్లి.. సున్నా వడ్డీ కింద ఏవరెవరికి డబ్బు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేము చెల్లిస్తాం. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్ళ కింద చిరు వ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారిని ప్రోత్సహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Comments