Skip to main content

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 30న అపాయింట్ మెంట్ ఆర్డర్లు

వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సాయంతో పరిపాలన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉద్యోగుల కోసం నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కొన్నిరోజుల క్రితమే పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇకపై ప్రజాపాలన స్థానిక సచివాలయాల ద్వారానే అందిస్తామని చెప్పారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాల్లో పౌరసేవలు ప్రారంభమవుతాయని, 72 గంటల్లో పూర్తయ్యేలా 10 సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఆ తర్వాత సేవలను మరింత పెంచుకుంటూ పోతామని విజయ్ కుమార్ వివరించారు.

పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు మూడ్రోజుల్లోనే ఇస్తామని, డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలను వెంటనే ఇచ్చేస్తామని తెలిపారు. వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా, పెన్షన్లు వంటి పథకాలను గ్రామ సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని అన్నారు

Comments

Popular posts from this blog

అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట.. ఈ పాట' అంటూ కొత్త సినిమా సాంగ్ విడుదల చేసిన సాయితేజ్‌

 అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది?' అంటూ నిన్న సోలో బతుకే సో బెటరు సినిమాలోంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా హీరో సాయితేజ్‌ ఈ రోజు ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. 'అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట... ఈ పాట...' అంటూ సాయితేజ్‌ కామెంట్ చేశాడు. 'హేయ్  నేనేనా' అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి 'నో పెళ్లి' సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.                            

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

  రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి...