Skip to main content

జాతీయ స్ధాయిలో కీర్తి పతాకాన్నిఎగురవేసిన ప‌ర్యాట‌క శాఖ‌

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం జాతీయ స్ధాయిలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులలో మూడింటిని కైవసం చేసుకోవటం ద్వారా రాష్ట్ర పర్యాటకం తన సత్తా చాటింది. కొత్త డిల్లీ వేదికగా జరిగిన ప్రత్యేక వేడుకలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆంద్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆంధ్రప్రదేశ్ పర్యటక అభివృద్ది సంస్ధ నిర్వహణ సంచాలకులు ప్రవీణ్‌కుమార్  ఈ అవార్డులు అందుకున్నారు. మొత్తం మూడు విభాగాలలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకోగా ఉత్తమ పర్యటక రాష్ట్రంగా అత్యున్నత స్ధాయి పురస్కారం రాష్ట్రానికి రావటం విశేషమని ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక , క్రీడా యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామని, ఆ క్రమంలోనే తమ శాఖ ఈ పురస్కారాలను దక్కించుకుందన్నారు. ఆంగ్ల భాషలో అత్యున్నత పర్యాటక ప్రచురణను సైతం ఏపి పర్యాటక రంగమే రూపొందించగలిగిందని ముఖ్య కార్యదర్శి వివరించారు.  జాతీయ స్దాయిలో స్నేహ పూర్వక రైల్వే స్టేషన్ గా విశాఖపట్నం దక్కించుకోవటం సాధారణ విషయం కాదని వివరించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదే పరంపరను కొనసాగిస్తామని, పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారని తెలిపారు. పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డులు దక్కించుకోగలిగామని, ఇది త‌మ బాధ్యతను మరింత పెంచిందన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.