Skip to main content

చంద్రబాబుకు ఎంతైనా అత్తని కదా! ఇల్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: లక్ష్మీపార్వతి సెటైర్లు

కేవలం నాలుగు నెలల పాలనలో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ దేనని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యం అని విమర్శించారు. పీపీఏలలో, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పైనా విమర్శలు చేశారు. ‘ట్విట్టర్’ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబు దే నంటూ సెటైర్లు విసిరారు.
తెలుగులో మంచి సామెత ఉంది ‘ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే, ఏం చెయ్యాలో తెలియక నక్క తోక ఎండబెట్టుకుందట’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు.

కరకట్టపై ఉన్న ఇంట్లో చంద్రబాబు నివసించడంపై ఆమె విమర్శలు చేశారు. ‘కరకట్ట మీద ఉన్న నీ ఇల్లు పోతుందా? అది నీ ఇల్లా? నువ్వు కట్టావా? ఎవరిచ్చారో చెప్పు? మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా? లేకపోతే మీ నాన్న గారు ఏమన్నా వారసత్వ హక్కుగా తెచ్చి నీ పేరుతో రిజిష్టర్ చేసి పోయారా?’ అని ప్రశ్నించారు. ‘నాకైతే డౌట్ గానే ఉంది. ఆ అక్రమకట్టడంలో నువ్వు(చంద్రబాబు) వేల కోట్ల డబ్బులు ఏమన్నా దాచిపెట్టావా? ఎట్లా అయినా అత్తని కదా! ఆ సానుభూతితో చందాలు వసూలు చేసి నీకు ఇల్లు కట్టించి ఇవ్వమంటే అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను.

ఈ సందర్భంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు, కోడెల బిడ్డల కారణంగానే ఆయన మృతి చెందారని ఆరోపించారు. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నీచమైన కుట్రలకు పాల్పడ్డారని, శవరాజకీయాలు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు ఒకే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నీతివంతమైన జగన్ పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తాడేపల్లిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, అవినీతి రహిత పాలన చేస్తున్నారని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.