బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను ఆమె కుమార్తె బన్సూరి తాజాగా నెరవేర్చారు. పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించినందుకు గాను ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను నెరవేర్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కన్నుమూయడానికి గంట ముందు హరీశ్ సాల్వేతో మాట్లాడిన సుష్మా స్వరాజ్.. కేసు గెలిచినందుకు గాను చెల్లించాల్సిన ఫీజు ఒక రూపాయిని వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని ఇటీవల హరీశ్ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుష్మ కుమార్తె బన్సూరి ఆ రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను తీర్చారు.

Comments
Post a Comment