టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అశోక్ గజపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు అశోక్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Post a Comment