Skip to main content

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ లో కేసు నమోదు

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత్ పై నోరు పారేసుకున్నారంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ లో కేసు నమోదైంది. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది ఇమ్రాన్ ఖాన్ పై చీఫ్ జ్యుడిషియల్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

అణుయుద్ధం తప్పదంటూ భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డారని ఓఝా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేవిగా ఉన్నాయని, ఓ వర్గానికి అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ మేరకు పాక్ ప్రధానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.

Comments