జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన దరిమిలా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ కోసం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం అక్టోబరు 1 నుంచి పిటిషన్లపై విచారణ జరపనుంది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment