Skip to main content

చిరంజీవి రాజకీయ సలహాపై కమలహాసన్ స్పందన!

తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక సూచన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యల పట్ల కమల్ స్పందించారు. గెలుపు, ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని కమల్ అన్నారు. మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయరంగంలోకి ప్రవేశించానని చెప్పారు. చిరంజీవి గతంలో తనకెప్పుడూ సలహాలు ఇవ్వలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచన ధోరణిపై అవగాహన పెరిగిందని చెప్పారు.

Comments