Skip to main content

పాన్ తో ఆధార్ అనుసంధానం... మరో మూడు నెలలు గడువు పొడిగింపు

కాస్త హెచ్చు స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే పాన్ కార్డు లావాదేవీలను మరింత భద్రతతో నిర్వహించేందుకు వీలుగా దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వ ఇటీవలే నిర్ణయించింది. ఆ మేరకు పాన్ తో ఆధార్ అనుసంధానానికి సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది.

ఇప్పుడా గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో మూడు నెలలు గడువు పెంచుతూ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా విధించిన గడువు ప్రకారం వినియోగదారులు తమ పాన్ కార్డులను డిసెంబరు 31 లోపు ఆధార్ తో అనుసంధానించుకోవాలి.

Comments