Skip to main content

ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ

 
ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టండి: మోదీ
రియాద్‌ (సౌదీ అరేబియా): భారత్‌లో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ సౌదీకి చెందిన సంస్థలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో ప్రభుత్వం 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ రియాద్‌లో జరిగిన భవిష్యత్‌ పెట్టుబడుల ఆరంభ సదస్సు (ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఐదేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న మోదీ.. మౌలిక వసతుల రంగంలోనూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్క ఈ రంగంలోనే రాబోయే ఐదేళ్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. 
దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న విధానాలను మోదీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌, లాజిస్టిక్‌ పర్ఫార్మెన్స్‌లో తమకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకింగ్‌లను ప్రస్తావించారు. అంతేకాక దేశంలోని 400 విలియన్ల యువతకు రాబోయే 3-4 ఏళ్లలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. 
‘‘2024 కల్లా చమురు రిఫైనింగ్‌, పైపు లైన్లు, గ్యాస్‌ టెర్మినల్స్‌ తదితర రంగాల్లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఉన్నాం. సౌదీకి చెందిన ఆరామ్‌కో సంస్థ వెస్ట్‌కోస్ట్‌ రిఫైనరీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రిఫైనరీ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దది’’  అని మోదీ వివరించారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.