Skip to main content

'మెగా ఫ్యామిలీ' చిత్రంపై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ



ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో వివాదాల తుట్టెను కదిలించిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. తన తదుపరి చిత్రం 'మెగా ఫ్యామిలీ' అంటూ అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను రేపు ప్రకటిస్తానని చెప్పారు. అయితే, 'మెగా ఫ్యామిలీ' సినిమాను తాను తెరకెక్కించడం లేదని కాసేపటి క్రితం మరో ట్వీట్ చేశారు. 'మెగా ఫ్యామిలీ' అనేది 39 మంది పిల్లలు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన చిత్రమని చెప్పారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారని... పిల్లల సినిమాలను చిత్రీకరించడంలో తనకు అనుభవం లేదని... అందుకే ఈ సినిమాను తెరకెక్కించకూడదని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.