ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ తన పోరాటాన్ని మరింత పదునెక్కిస్తోంది. టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇసుక కొరత, తదనంతర పరిణామాలపై నిరసనగా
రేపు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించనున్నారు. ఈ నిరసన ప్రదర్శనకు భారీగా
టీడీపీ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉంది.
Comments
Post a Comment