Skip to main content

పవన్ కల్యాణ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిది: అవంతి



జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ…. పవన్ కల్యాణ్ టీడీపీకి అద్దె మైక్ లా మాట్లాడే కంటే.. జనసేనను టీడీపీలో కలిపేస్తే సరిపోతుందన్నారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖను అభివృద్ది చేస్తామన్నారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్ ద్వారా నిజాలు బయటకొస్తాయన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 80శాతం జగన్ అమలు చేశారన్నారు.

Comments