Skip to main content

మరో ఐదేళ్ల పాటు నేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాను: శివసేనకు ఫడ్నవీస్ షాక్



మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించారు. మరో ఐదేళ్ల పాటు తానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న ఫార్ములాపై ఒప్పందం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో స్థిరమైన, సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శివసేనకు సీఎం పదవి ఇవ్వాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారని ఆయన అన్నారు.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో  సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here