Skip to main content

ట్వీట్‌తో వేడి పుట్టించిన పూన‌మ్ కౌర్‌.. మండిపడుతున్న పవన్ అభిమానులు


టాలీవుడ్ నటి పూనం కౌర్ సినిమాల కంటే ట్వీట్ల ద్వారానే బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ ఆమె పతాక శీర్షికలకు ఎక్కింది. గత కొంత కాలంగా ఆమె మౌనం వహించింది. కానీ, తాజాగా మరో ట్వీట్ చేసి మళ్లీ వేడి పుట్టించింది. 'ఒక అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కావచ్చేమో కానీ... లీడర్ మాత్రం ఎప్పటికీ కాలేడు' అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే, ఎవరిని ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ చేసిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎవరి పేరును ఆమె ప్రస్తావించకపోయినప్పటికీ... పవన్ ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఈ ట్వీట్ రానున్న రోజుల్లో ఎంత దుమారం రేపుతుందో వేచి చూడాలి.

Comments