ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. కాకినాడ గ్రామీణం తూరంగి వద్ద శ్రీ చైతన్య పాఠశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తోన్న నలుగురు కూడా నియంత్రణ కోల్పోయి పడిపోవడంతో గాయాలయ్యాయి.
అదే సమయంలో కురసాల కన్నబాబు కాకినాడ నుంచి తూరండి మీదుగా అమరావతి వెళుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్ ను ఆపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయాలపాలైన వారిని మరో వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఆ పాఠశాల బస్సులో దాదాపు 100 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Post a Comment