Skip to main content

అరటిపండ్లు తినడానికి ఏం తొందరపడుతున్నాయో... గోవులతో పవన్ కల్యాణ్ మురిపెం




జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.

ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Comments