Skip to main content

రేపు ఖట్టర్‌ ప్రమాణస్వీకారం..!

 రేపు ఖట్టర్‌ ప్రమాణస్వీకారం..!
రేపు ఖట్టర్‌ ప్రమాణస్వీకారం..!
హరియాణా ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి మనోహర్ లాల్‌ ఖట్టర్‌ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఖట్టర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భాజపా వర్గాలు తాజాగా వెల్లడించాయి. మరోవైపు భాజపా శాసనసభాపక్షం నేడు భేటీ అయి ఖట్టర్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.  
గోపాల్‌ కందా మద్దతు తీసుకోం..
వివాదాస్పద నేత, ఎమ్మెల్యే గోపాల్‌ కందా మద్దతు తీసుకునే ఆలోచనే లేదని భాజపా స్పష్టం చేసింది. ‘ఎవరికైనా మద్దతిచ్చే స్వేచ్ఛ గోపాల్‌ కందాకు ఉంది. కానీ మేం ఆయన మద్దతు తీసుకోవాలని అనుకోవట్లేదు. ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుంటామనే ప్రశ్నే లేదు’ అని భాజపా నేత అనిల్‌ విజయ్‌ తెలిపారు. 
ఏ పార్టీకి సరైన ఆధిక్యం రాని హరియాణాలో జన్‌నాయక్‌ జనతా పార్టీ మద్దతుతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వానికి మళ్లీ ఖట్టరే నేతృత్వం వహించనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఖట్టర్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సీఎం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.