Skip to main content

బొత్సపై టీడీపీ నేతల ఎదురుదాడి... 25 ప్రశ్నలతో లేఖ

టీడీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై ధ్వజమెత్తారు. ప్రజా రాజధానికి కులతత్వం ఆపాదించి, ప్రాంతీయ తత్వం ఎగదోసి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా మంత్రి స్థాయిని దిగజార్చారంటూ ఆరోపించారు. ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అని, ఇది ముంపు ప్రాంతం అని రోజుకో విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోతే ఇక్కడికి వచ్చి ఎవరు పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పోషించగల, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించగల రాజధాని అవసరం లేదా? అని నిలదీశారు. ఈ మేరకు బొత్సకు రాజధాని అంశంపై 25 ప్రశ్నలతో ఒక బహిరంగ లేఖ రాశారు.  

Comments