గుంటూరు నగరంలో ఈరోజు పర్యటించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. గత కొన్నాళ్లుగా ఇసుక అందుబాటులో లేక పనులు నిలిచిపోవడంతో ఆగ్రహోదగ్రులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు నగరానికి వచ్చిన బొత్సను అడ్డుకుని నిలదీశారు.
ప్రభుత్వ విధానం వల్ల పనుల్లేక అర్ధాకలితో బతుకుతున్నామని, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు చేసిన మేలు ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులను సముదాయించి బొత్స ముందుకు సాగారు. అనంతరం నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ప్రారంభమైన రోడ్లు, కాలువల నిర్మాణంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇలా తయారయ్యాయని, తమ ప్రభుత్వం వీటిని పూర్తి చేస్తుందని తెలిపారు.
Comments
Post a Comment