Skip to main content

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు కేసీఆర్ ఓకే.. నేడు చర్చలు?

 
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆ సంస్థ ముఖ్యకార్యదర్శి, ఇన్‌చార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తదితరులతో  ప్రగతి భవన్‌లో నిన్న సాయంత్రం నాలుగు గంటలపాటు జరిపిన సుదీర్ఘ సమీక్ష అనంతరం కార్మికులను చర్చలకు పిలవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో నేడు కార్మిక సంఘాల నాయకులతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ బస్‌భవన్‌లో సమావేశం కానుందని సమాచారం.

నేటి ఉదయం కార్మిక సంఘాలకు చర్చలకు సంబంధించిన సమాచారం ఇవ్వనున్నారు. అయితే, చర్చలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. చర్చల విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.   

Comments