ఇసుక కొరతతో ఏపీలోని భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వంపై
విపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. తాజాగా భవన నిర్మాణ
కార్మికులతో కలసి జనసేన నేతలు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని
ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని, తమకు ఉపాధి కల్పించాలని నినదించారు.
ఈ
సందర్భంగా కార్మికులు, జనసేన నేతలతో అవంతి మాట్లాడారు. తమ కష్టాలను
మంత్రికి కార్మికులు వివరించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ, వీలైనంత త్వరలో
ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పార్టీలు కావాలనే ఈ
అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని, రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయని
విమర్శించారు.
Comments
Post a Comment