Skip to main content

వారిది న్యాయమైన డిమాండ్‌ : శివసేనకు మద్దతు పలికిన ఎన్‌సీపీ అధినేత పవార్‌





మహారాష్ట్రలో అధికారం పంచుకోవాలని ఆశిస్తున్న శివసేనకు  నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్‌ మద్దతుగా నిలిచారు. ముఖ్యమంత్రి పీఠాన్ని చెరిసగం రోజులు పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌లో న్యాయం ఉందని అన్నారు. శివసేన చేస్తున్న డిమాండ్‌ కొత్తదేమీ కాదని, 1990లో కూడా ఈ ఫార్ములాను అనుసరించిన కారణంగా తాజాగా వారీ డిమాండ్‌ చేస్తున్నారని వెనకేసుకొచ్చారు ఈ సీనియర్‌ నేత. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్ధమైనా ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు కూడా ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తుండడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్‌పవర్‌ స్పందన చర్చనీయాంశంగా మారింది.

వాస్తవంగా కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలు చెలరేగినా అదేం లేదని ఎన్సీపీ కొట్టిపారేసింది. మరి సీనియర్‌నేత పవార్‌ తాజా ప్రకటన ఎందుకు చేశారన్నది తెలియాల్సి ఉంది.

Comments