Skip to main content

టీడీపీ పతనం వల్లభనేని వంశీతో ప్రారంభమైంది.. ఎంతదాకా వెళ్తుందో చూడాలి: విష్ణువర్ధన్ రెడ్డి


ఇప్పటి వరకు నీతులు చెప్పిన వైసీపీ మాట మార్చిందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కునే పనిలో పడిందని అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో వల్లభనేని వంశీతో కొత్త రాజకీయాలను ప్రారంభించిందని చెప్పారు.

చంద్రబాబు మీద టీడీపీ ఎమ్మెల్యేలకు విశ్వాసం కొరవడిందని అన్నారు. ఏపీలో టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. వల్లభనేని వంశీతో ప్రారంభమైన ఈ పరిణామం... రానున్న రోజుల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలని అన్నారు. తన గోతిని తానే తీసుకోవడం అంటే ఇదే చంద్రబాబుగారూ అంటూ సెటైర్ వేశారు. వల్లభనేని వంశీ నిన్న ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీతో అంటీముట్టనట్టు ఉన్న వంశీ... వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.   

Comments