Skip to main content
కాచిగూడలో ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్ తప్పిన పెను ప్రమాదం
నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మలక్‌పేట
నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు-హైదరాబాద్
హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికిపైగా
గాయాలైనట్లు సమాచారం. ఐదు బోగీల వరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో
ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న
రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాచిగూడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన
కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలవల్లే
ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.
Comments
Post a Comment