Skip to main content

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటి వాయిదా



తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ చేస్తోన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రూట్లను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోన్న ప్రభుత్వం రేపటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఈ రోజు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులపై నివేదికను కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య కోర్టుకు తెలిపారు.

కోర్టు బదులిస్తూ.. న్యాయస్థానాలు చట్ట ప్రకారమే కేసులను పరిష్కరిస్తాయని తెలిపింది. భావోద్వేగాలు, సానుభూతితో కేసులను పరిష్కరింవని  స్పష్టం చేసింది. సమ్మె ప్రారంభంలోనే.. విధుల్లో చేరితే చేరండి లేకపోతే లేదని, ప్రభుత్వం కార్మికులకు చెప్పిందంటూ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయం తీసుకుందని కోర్టు ప్రస్తావించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది.  సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ కోర్టు, ట్రిబ్యునల్ ప్రకటించలేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ ను ఆర్టీసీ సమ్మె కేసుల విచారణలో తోడ్పడాలని కోరింది.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.