Skip to main content

పవన్ కల్యాణ్ కి ముగ్గురు భార్యలు' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శతఘ్ని ఘాటు వ్యాఖ్యలు.. పవన్ వీడియో పోస్ట్

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని టీమ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

'పవన్ కల్యాణ్ ని కూడా అడుగుతున్నా.. అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తున్నారో అడుగుతున్నాను' అని జగన్ చేసిన వ్యాఖ్యలను శతఘ్ని వీడియోలో వినిపించింది.

మరోవైపు, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్ కి గతంలో పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో పవన్... 'జగన్ ని అడగాలనుకుంటున్నాను నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లారా? తమాషాగా ఉందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని అన్నారు.

'వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్ గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్థ జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?' అని శతఘ్ని టీమ్ ప్రశ్నించింది.

'మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కల్యాణ్ గారి పెళ్లిళ్ల వల్లే అంట నిజమా జగన్?' అని పేర్కొంది.

Comments