Skip to main content

డిస్నీ సినిమాలో మహేష్ గారాలపట్టి సితార…!


కొన్ని హాలీవుడ్ సినిమాలకు సౌత్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే డిస్నీ నుంచి వచ్చే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి. కాగా… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఇటీవ‌ల సొంతంగా యూట్యూబ్ లో ఓ ఛానల్ కూడా ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు సితార. అడ‌పాద‌డ‌పా ఆమెకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌డం, వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోవ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య సొంతంగా యూట్యూబ్ లో A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సితార హాలీవుడ్‌కు చెందిన డిస్నీ స్టూడియోతో పని చేసే అవకాశం వచ్చింది. డిస్నీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ఫ్రోజెన్ 2″లో ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేష్ ముద్దుల కూతురు సితార గాత్ర దానం చేసింది. దీనికి సంబందించిన అధికార ప్రకటన కూడ విడుదల చేసింది డిస్నీ. ఫ్రోజెన్ 2 సినిమాను డిస్నీ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషాల్లో విడుదల చేస్తోంది. హిందీలో చిన్ననాటి ఎల్సా పాత్రకు పరిణీతి డబ్బింగ్ చెప్పింది. ఎల్సా ప్రధాన పాత్రకు గ్లోబల్ స్టార్ ప్రియాంక గాత్ర దానం చేస్తోంది. తమిళ్‌లో ఈ పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్ చెప్పగా, తెలుగు‌లో మాత్రం నిత్యా మీనన్ చెబుతోంది.

Comments