Skip to main content
దెయ్యం ప్రాంక్ వీడియోలు.. యువకుల అరెస్టు!
బెంగళూరు:
యూట్యూబ్ ప్రాంక్ వీడియోల పేరుతో దెయ్యం వేషాధారణలో స్థానికులను
భయపెడుతున్న కొందరు యువకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని యశ్వంత్‌పుర సమీపంలోని షరీఫ్‌నగర్‌కు
చెందిన కొందరు వ్యక్తులు యూట్యూబ్ ప్రాంక్ వీడియోలు చేయడం ప్రారంభించారు.
ఈక్రమంలో వారు దెయ్యం వేషాధారణలో (పెద్ద గోళ్లు, తెల్ల గౌన్లు, రక్తపు
మరకలతో) ప్రజలను భయపెట్టి వారి హావభావాలను వీడియోలు తీస్తున్నారు.
రైల్వేస్టేషన్‌కు ఆటోలో వెళ్లే ప్రయాణికులను భయభ్రాంతులకు
గురిచేస్తున్నారు. ఈ విషయమై కొందరు స్థానికులు వారిపై ఫిర్యాదు చేశారు.
దీంతో వారిలో ఏడుగురిని గుర్తించి అరెస్టు చేశారు. ఒకరి మొబైల్‌లో పలు
ప్రాంక్ వీడియోలు సైతం గుర్తించారు. అరెస్టయిన వారిలో 18 నుంచి 25 మధ్య
వయసున్న యువకులే ఉన్నారు. వారు ప్రాంక్ వీడియోలే చేయాలనుకున్నారు.. కానీ
చేసిన విధానం చాలా ప్రమాదకరంగా ఉందని బెంగళూరు నార్త్ డీసీపీ శశికుమార్
అన్నారు.
Comments
Post a Comment