ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని నియమితులు
కానున్నారని తెలుస్తోంది. సహాని ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయశాఖ
కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు.
సహానీని తమ రాష్ట్రానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖలో
కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సహానీ రాష్ట్రానికి బదిలీ కానున్నారని
వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కేంద్రం దీనిపై ఉత్తర్వులు జారీ చేసే
అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Post a Comment