ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే ఎన్పీసీ, కాంగ్రెస్‌లకు చెరొకటి చొప్పున రెండు డిప్యూటీ సీఎం పదవులిస్తామని శివసేన ఆఫర్ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవికి కూడా సేన నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఏర్పడిన తర్వాత మిత్రపక్షాల మద్దతుతోనే సీఎం ఎన్నిక ఉంటుందని శివసేన వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్‌ను కలవనున్న ఏక్‌నాథ్
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరి తెలియజేసేందుకు శివసేన శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్ షిండే ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. అటు తాజా పరిణామాలపై చర్చించేందుకు పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమయ్యారు.
సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ భేటీ
మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఈ ఉదయం అయ్యింది. శివసేనతో పొత్తు పెట్టుకుంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి పార్టీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం సేనతో చేతులు కలపాలని 85శాతం మంది మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
సమావేశమైన భాజపా కోర్ కమిటీ
అటు తాజా పరిణామాలపై భాజపా కోర్ కమిటీ కూడా భేటీ అయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నివాసంలో భాజపా నేతలు సమావేశమయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు కూడా భేటీ అయ్యారు.
Comments
Post a Comment