Skip to main content

లీడర్లకు నా అభ్యర్థన.. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!: పవన్ కల్యాణ్



ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. ప్రతిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

"మీ అభిప్రాయాలు వెలువరించే సమయంలో అప్రమత్తత అవసరం" అని అన్నారు. ‘నేతలు, విద్యావంతులకు నేను విన్నపం చేస్తున్నా.. మీ అభిప్రాయాలు చివరకు విధానాలుగా రూపాంతరం చెందుతాయి. అవి కొన్ని తరాలపై ప్రభావం చూపుతాయి. అందుకే, ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నా

Comments