ఏపీలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బాహాటంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు బదులుగా సీఎం జగన్ వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకువచ్చారు. ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు అంటూ స్పందించారు. ఈ నేపథ్యంలో పవన్ తాజాగా 'ఇంగ్లీష్ మీడియం' అంశంపై వ్యాఖ్యానించారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వైసీపీ ఇంగ్లీషు మీడియం ప్రతిపాదనపై విరుచుకుపడిందని ఆరోపిస్తూ, 'మాతృభాషకు మంగళం' అంటూ 'సాక్షి'లో వచ్చిన కథనాన్ని పోస్టు చేశారు. అంతేకాదు, 'ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా?' అంటూ మరో కథనాన్ని కూడా ట్వీట్ చేశారు. అప్పుడు, ఇప్పుడు వైసీపీ కపట ధోరణికి ఇదే నిదర్శనం అంటూ పేర్కొన్నారు.
Comments
Post a Comment