Skip to main content

ఇంకా ఎంత కాలం ప్రయత్నిస్తారు బాబూ?: విజయసాయి రెడ్డి

 


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియంను ప్రవేశ పెడుతున్నామని సీఎం జగన్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనిపై టీడీపీ నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.

'ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం  ప్రతి విద్యార్థి హక్కు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధన జరగాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా బలహీన వర్గాల వారిని ఉంచాలని ఇంకా ఎంత కాలం ప్రయత్నిస్తారు బాబూ?' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

Comments