రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ లాంగ్ మార్చ్ కొద్దిసేపటి క్రితమే మద్దిలపాలెం నుంచి ప్రారంభమైంది. మొదట పవన్ కల్యాణ్ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. జనసేన నిర్వహిస్తున్న ఈ లాంగ్ మార్చ్ మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది.
ప్రస్తుతం విశాఖ నగరం జనసంద్రంగా మారింది. భారీగా తరలివచ్చిన భవన నిర్మాణ రంగ కార్మికులు, జనసేన కార్యకర్తలతో మద్దిలపాలెం వద్ద కోలాహలం నెలకొంది. లాంగ్ మార్చ్ లో మొదటి వరుసలో పవన్ తో పాటు భవన నిర్మాణ కార్మికులు నడవనున్నారు. రెండో వరుసలో మహిళలు, మూడో వరుసలో జనసైనికులు ఉంటారని తెలుస్తోంది. లాంగ్ మార్చ్ అనంతరం ఓల్డ్ జైల్ రోడ్ లో జనసేన బహిరంగ సభ ఉంటుంది
Comments
Post a Comment