Skip to main content

పొలిటికల్ జర్నీకి బ్రేక్.. ‘పింక్’ రీమేక్‌కు రెడీ

Pawan Kalyan re-entry confirms, పొలిటికల్ జర్నీకి బ్రేక్.. ‘పింక్’ రీమేక్‌కు రెడీ

పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సినిమాల్లోకి ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాదు దర్శకుడు, నిర్మాత కూడా ఖరారు అయ్యారు. మీరు చదువుతున్నది నిజంగా నిజం.
బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఎమ్‌సీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్కాగా హిందీలో ఘన విజయం సాధించిన పింక్‌ను తమిళ్‌లో ఇటీవల అజిత్ రీమేక్ చేశాడు. ‘నేర్కొండ పావై’ పేరుతో వచ్చిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీ రాబోతుంది.
అయితే పవన్ చివరగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఙ్ఞ్యాతవాసిలో కనిపించారు. ఆ తరువాత పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన ఆయా స్థానాల్లో ఓడిపోయారు. అయినప్పటికీ.. ప్రజల తరఫున సమస్యలపై ఆయన పోరాడుతున్నారు. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారా..? లేక ఈ బ్రేక్ కొద్ది రోజులా..? అన్న ప్రశ్నలపై కాలమే సమాధానం చెప్పాలి.
ఇదిలా ఉంటే ఎమ్‌సీఏ తరువాత వేణు శ్రీరామ్, అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత సుకుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటించబోతున్నాడు.  ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఇంకాస్త సమయం పట్టనుండటంతో.. ఆ లోపు పవన్‌తో పింక్ రీమేక్‌ను చేయనున్నాడు వేణు శ్రీరామ్. ఏదేమైనా మొత్తానికి తమ అభిమాన నటుడు మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవ్వడంతో.. అభిమానులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆదర్శ్ అధికారికంగా ప్రకటించాడు.

Comments