Skip to main content

మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం


Our phones were snatched but stars took selfies, ‘ మోదీజీ ! ఇంత పక్షపాతమా ? ‘ బాలు మనస్తాపం
ప్రధాని మోదీ తీరు పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు, ‘ గాన గంధర్వ ‘ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని కలిసిన సందర్భంలో ఆయన, మరికొందరు తమపట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని బాలు తన ఫేస్ బుక్ లో మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. తమ సెల్ ఫోన్లన్నీ లాక్కున్నారని, వాటికి టోకెన్లు ఇచ్చారని, అయితే బాలీవుడ్ స్టార్స్ మాత్రం ప్రధానితో సెల్ఫీలు దిగారని ఆయన అన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ ఈనాడు ‘ చీఫ్ రామోజీరావుకు నేనెంతో కృతజ్ఞుడిని.. ఆయన చేసిన ఏర్పాట్ల కారణంగా నేను గత నెల 29 న ఢిల్లీలో మోదీ నిర్వహించిన రిసెప్షన్ కి వెళ్లాను.. కానీ వెళ్ళగానే మా సెల్ ఫోన్లను వదిలేయాలని అక్కడి సెక్యూరిటీ కోరారు. వాటికి మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ అదే రోజున బాలీవుడ్ స్టార్స్ మోదీతో సెల్ఫీలు దిగడం చూసి ఆశ్చర్యం వేసింది ‘ అని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా గాంధీయిజాన్ని ప్రమోట్ చేసేందుకు మోదీ గతవారం తన నివాసంలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ సహా బాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. కానీ దక్షిణాది నుంచి తెలుగు నిర్మాత దిల్ రాజు ఒక్కరే అక్కడ కనిపించారు. కాగా- మోదీ వ్యవహరించిన తీరు పట్ల పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా తన ట్విట్టర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది నుంచి మన ప్రతినిధులెవరూ కనిపించకపోవడం పట్ల ఆమె సైతం కలత చెందారు.. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆమె మోదీని కోరారు.

Comments