తెలుగు బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్, క్యాథరిన్ తో పాటు పలువురు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ షో నిర్వాహకులు విడుదల చేసిన ఓ ప్రోమోను చూస్తే బుల్లితెర యాంకర్లు కూడా గ్రాండ్ ఫినాలేకు వస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ షోకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సినీనటుడు శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను షూటింగ్ అయినా మానేస్తా కానీ బిగ్‌బాస్ మాత్రం మాననని అన్నాడు. గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీల హంగామాతో మామూలుగా ఉండదని తెలుస్తోంది.
బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్ కే అధికంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్ విజేత ఎవరో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. టైటిల్ పోరులో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి నిలిచారు. వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు.
దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం జరిగే గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గ్రాండ్ ఫినాలె చూడడానికి సిద్ధమా? ఈ రోజు సాయంత్రం మరింత సర్ ప్రైజ్.. మరింత ఫన్' అంటూ స్టార్ మా ట్వీట్ చేసింది.
Comments
Post a Comment