Skip to main content

5100 రూట్లకు అనుమతులిస్తే కార్మికుల పరిస్థితి ఏంటి?: కేసీఆర్ ప్రకటనపై ఆశ్వత్థామరెడ్డి స్పందన


కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని, కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు.

ఆర్టీసీలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. 5100 రూట్లకు అనుమతులు ఇస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ డిమాండ్లను కేసీఆర్ అంగీకరిస్తే యూనియన్లు ఉండవని ఆయన చెప్పారు.

కాగా, నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు బాధ్యతారహితంగా సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.